News
వైద్యం సరిగ్గా అందక పొతే చర్యలు
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కార్మికులకు వైద్యం సరిగ్గా అందక పొతే చర్యలు తప్పవని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్మిక శాఖలో ఆరోగ్య బీమా సేవలు దేశ వ్యాప్తంగా విస్తరించాలని మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో 393 జిల్లాల్లో మాత్రమే ఈఎస్ఐ సేవలు అందించిందని, ఇప్పుడు 700 జిల్లాల్లో ఈఎస్ఐ సేవలు అందిస్తున్నామని దత్తాత్రేయ చెప్పారు. ఈఎస్ఐ డీస్పెన్సరీలను అప్‌గ్రేడ్ చేస్తున్నామని, ఈఎస్ఐ ద్వారా 20 కోట్ల మందికి వైద్య సేవలు అందిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ఆసంఘటిత రంగ కార్మికులను పట్టించుకోలేదని, తెలంగాణలో 5 మొబైల్ ఈఎస్ఐ బస్సులను ప్రారంబిస్తామని ఆయన చెప్పారు. ఈనెల 12న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఆలయ్ బలయ్ జరుగుతుందని, ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు, ప్రముఖులను ఆహ్వానించామని దత్తాత్రేయ తెలిపారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








